Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 79 పరుగులకే ఆలౌట్
హైదరాబాద్ : రంజీ ట్రోఫీలో హైదరాబాద్ నిలకడగా చెత్త ప్రదర్శన చేస్తుంది. ఎలైట్ గ్రూప్-బిలో సౌరాష్ట్రతో మ్యాచ్లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 79 పరుగులకే కుప్పకూలింది. జింఖానా మైదానంలో తొలుత బ్యాటింగ్కు వచ్చిన హైదరాబాద్ 30.5 ఓవర్లలోనే చేతులెత్తేసింది. రోహిత్ రాయుడు (23), భగత్ వర్మ (11), అనికెత్ రెడ్డి (10) మినహా మరో బ్యాటర్ రెండెంకల స్కోరు సాధించలేదు. తన్మరు (2), అలంకృత్ (7), తొల్కంటి గౌడ్ (4), చందన్ (2), భవేశ్ (3), రవితేజ (8), శశాంక్ (5), మోహిద్దున్ (0) తేలిపోయారు. సౌరాష్ట్ర బౌలర్లలో జడేజా (3/8), జైదేవ్ (3/28), సకారియ (1/8), యువరాజ్సిన్హ (2/23) వికెట్ల వేటలో అదరగొట్టారు. ఇక, సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఓపెనర్లు హార్విక్ (81), చిరాగ్ (68) సహా షెల్డన్ జాక్సన్ (59) అర్థ సెంచరీలు బాదటంతో తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు 250/5తో పటిష్ట స్థితిలో కొనసాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర 171 పరుగుల ముందంజలో నిలిచింది.