Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.130 కోట్ల డిస్కౌంట్‌కు బోర్డు నిరాకరణ
ముంబయి : బీసీసీఐ ఇంటర్నేషనల్, డొమెస్టిక్ సీజన్ ప్రసార భాగస్వామి స్టార్ ఇండియాతో బోర్డు అపెక్స్‌కౌన్సిల్ విభేదించింది. ఐదేండ్ల ఒప్పందం ప్రకారం స్టార్ ఇండియా సగటున మ్యాచ్‌కు రూ.60 కోట్లు చెల్లించాలి. ఒప్పందం ప్రకారం ప్రతి మ్యాచ్‌కు తొలి ఏడాది రూ.46 కోట్లు, రెండో ఏడాది రూ.47 కోట్లు, మూడో ఏడాది రూ.46.5 కోట్లు, నాల్గో ఏడాది రూ.77.4 కోట్లు, ఐదో ఏడాది రూ.78.4 కోట్లు చెల్లించాలి. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఐదో ఏడాది రూ.78.4 కోట్లకు బదులుగా మూడో ఏడాది చెల్లించిన రూ.46.5 కోట్లు ఇస్తానని అంటోంది. కోవిడ్ పరిస్థితుల్లో జరిగిన భారత్, దక్షిణాఫ్రికా వైట్‌బాల్ సిరీస్‌పై స్టార్ ఇండియా అభ్యంతరం తెలిపింది. ఈ అంశంపై బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ విభేదించింది. దీంతో రూ.130 కోట్ల తగ్గింపు అంశంపై బీసీసీఐ, స్టార్ ఇండియా రాజీ చేసుకునే అవకాశం కనిపిస్తోంది.