Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సానియా ప్రకటన
హైదరాబాద్: భారత మహిళా స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా(35) ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ అనంతరం టెన్నిస్‌కు గుడ్ బై చెబుతున్నట్లు తాజాగా ప్రకటించింది. 'ఇదే నా చివరి గ్రాండ్ స్లామ్ టోర్నీ.. ఈ టోర్నమెంట్ అనంతరం మళ్లీ టెన్నిస్ రాకెట్ పట్టను.. ఈ నిర్ణయాన్ని మీతో పంచుకోవాలంటే నా కళ్లల్లో కన్నీళ్లు వస్తున్నాయి' అని ట్విటర్లో పోస్ట్ చేసింది. ఫిబ్రవరిలో జరిగే దుబారు ఓపెన్ తర్వాత ఆటకు వీడ్కోలు చెబుతున్నట్లు ఇటీవల ప్రకటించినా.. 16నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ తర్వాతే మరో టోర్నమెంట్ ఆడాలనే ఉద్దేశ్యం లేదని అందుకే ముందే గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తాజాగా వెల్లడించింది. గత ఏడాది ఆగస్టులో గాయపడ్డ సానియా మళ్లీ ఏ టోర్నీ బరిలోకి దిగలేదు.