Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పెయిన్‌పై 2-0గోల్స్‌తో గెలుపు
- హాకీ ప్రపంచకప్
బెంగళూరు: హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం రూర్కెలలోని బిర్సాముండా హాకీ స్టేడియంలో జరిగిన పోటీల్లో ఇంగ్లండ్ జట్టు వేల్స్‌ను చిత్తు చేయగా.. రెండో మ్యాచ్‌లో భారతజట్టు స్పెయిన్‌ను ఓడించింది. గ్రూప్-డిలో ఉన్న భారత్ తొలి లీగ్ మ్యాచ్‌ను 8వ ర్యాంక్ స్పెయిన్‌తో తలపడింది. తొలి క్వార్టర్‌లోనే భారత్ ఒక గోల్ కొట్టి 1-0 ఆధిక్యతను సంపాదించింది. ఆ గోల్‌ను రోహిదాస్ చేశాడు. రెండో గోల్‌ను హార్దిక్ సింగ్ 26వ ని.లో చేశాడు. దీంతో ప్రథమార్థం ముగిసే సమయానికే భారత్ 2-0గోల్స్ ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. రెండో అర్ధభాగంలో స్పెయిన్‌కు లభించిన పెనాల్టీ స్టోక్‌ను హర్మన్‌ప్రీత్ సింగ్ అద్భుతంగా నిలువరించి గోల్ చేయకుండా అడ్డుగోడగా నిలిచాడు. మూడో అర్దభాగంలో భారత్‌కు రెండు పెనాల్టీ కార్నర్లు లభించినా ప్రయోజనం లేకపోయింది. 47వ నిమిషంలో అభిషేక్ స్పెయిన్ ఆటగాడ్ని ప్రమాదకరంగా నిరోధించడంతో ఫీల్డ్ అంపైర్ 10నిమిషాలు సస్పెండ్ చేసి మైదానం నుంచి బయటకు పంపాడు. అప్పటినుంచి భారతజట్టు 10మంది ఆటగాళ్లతోనే మ్యాచ్‌ను కొనసాగించింది. 57వ ని.లో మళ్లీ అభిషేక్ మైదానంలోకి రాగా.. 53, 57వ ని.లో స్పెయిన్‌కు పెనాల్టీ కార్నర్లు లభించినా ప్రయోజనం లేకపోయింది. రెండో అర్ధభాగంలో స్పెయిన్ పుంజుకున్నా.. భారత డిఫెండర్లు అడ్డుగోడగా నిలవడంతో స్పెయిన్ ఆశలు అడియాశలయ్యాయి. ఇదే గ్రూప్‌లో ఉన్న ఇంగ్లండ్ తొలి మ్యాచ్‌లో 4-0తో వేల్స్‌ను చిత్తుచేసింది. దీంతో ఇంగ్లండ్, భారత్ 3పాయింట్లతో టాప్‌లో నిలిచాయి. 15న భారతజట్టు ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వడం ఇది వరుసగా రెండోసారి. ప్రతి గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచి నాలుగుజట్లు నేరుగా క్వార్టర్‌ఫైనల్ బెర్త్‌లు దక్కించుకోనున్న సంగతి తెలిసిందే.
క్రెగ్, జెరేమీ హ్యాట్రిక్స్..
పూల్-ఏలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు టామ్ క్రెగ్, జెరెమీ హైవార్డ్ హ్యాట్రిక్ గోల్స్ కొట్టారు. వీరితోపాటు ఫ్లెన్, విక్రమ్ కూడా ఒక్కో గోల్ కొట్టడంతో ఆస్ట్రేలియా జట్టు 8-0గోల్స్ తేడాతో ఫ్రాన్స్‌పై ఘన విజయం సాధించింది. టామ్ క్రెగ్ 9వ, 32, 45ని., జెరెమీ హైవార్డ్ 27, 29, 39వ ని., హ్యాట్రిక్ గోల్స్ కొట్టగా.. ఫ్లెన్ ఒగీవిర్ 27వ ని., టామ్ విక్రమ్ 54వ ని.లో ఒక్కో గోల్ కొట్టారు. ఆస్ట్రేలియా జట్టు ఎటాకింగ్ ఆటను ప్రదర్శించి ఫ్రాన్స్‌ను గుక్క తిప్పుకోకుండా చేసింది. ఈ మ్యాచ్‌కు కలింగ స్టేడియంలో జరిగింది. ఇదే గ్రూప్‌లో ఉన్న 2016 ఒలింపిక్స్ ఛాంపియన్ అర్జెంటీనా జట్టు దక్షిణాఫ్రికాపై గెలుపుకు చెమటోడ్చాల్సి వచ్చింది. అర్జెంటీనా తరఫున ఏకైక గోల్‌ను 42వ ని.లో కసెల్లా మైకో చేశాడు. దీంతో ఆ జట్టు 1-0తో దక్షిణాఫ్రికాపై గెలిచి ఊపిరి పీల్చుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా 14వ ర్యాంక్‌లో ఉండగా.. అర్జెంటీనా 7వ స్థానంలో ఉంది. అర్జెంటీనా తర్వాతి మ్యాచ్‌లో టాప్ ర్యాంక్ ఆస్ట్రేలియాతో 16న తలపడనుండగా.. దక్షిణాఫ్రికా జట్టు ఫ్రాన్స్‌తో అదేరోజు రెండోమ్యాచ్‌లో తలపడనుంది.