Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణాఫ్రికాపై ఏడు వికెట్ల తేడాతో గెలుప
- ఐసిసి అండర్-19 మహిళల ప్రపంచకప్
జోహాన్స్‌బర్గ్ : ఐసిసి అండర్-19 మహిళల ప్రపంచకప్ గ్రూప్-డిలో ఉన్న భారత జట్టు శుభారంభం చేసింది. ఐసిసి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తొలి అండర్-19 మహిళల ప్రపంచకప్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 166పరుగులు చేసింది. ఛేదనలో భారతజట్టు 16.3ఓవర్లలో కేవలం 3వికెట్లు కోల్పోయి 170పరుగులు చేసి గెలిచింది. టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టు పవర్‌ప్లే 6 ఓవర్లలోనే 70 పరుగులు చేసింది. లారెన్స్(61; 44బంతుల్లో 9ఫోర్లు, సిక్సర్), ల్యాండ్మన్(32) బ్యాటింగ్‌లో రాణించారు. షెఫాలీ వర్మకు రెండు, సోనమ్, చోప్రాకు ఒక్కో వికెట్ దక్కాయి. ఛేదనలో టీమిండియాకు కెప్టెన్ షెఫాలీ వర్మ(45; 16బంతుల్లో 9ఫోర్లు, సిక్సర్) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడింది. మరో ఓపెనర్ శ్వేతా సెహ్రావత్(92నాటౌట్; 57బంతుల్లో 20ఫోర్లు) విధ్వంస ఇన్నింగ్స్ ఆడింది. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 7 ఓవర్లలో 77పరుగులు జతచేశారు. ఆ తర్వాత త్రిషా(15), సౌమ్య తివారి(10) నిరాశపరిచినా.. సెహ్రావత్ ఒంటిచేత్తో మ్యాచ్‌ను ముగించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సెహ్రావత్‌కు లభించింది.
గ్రూప్-డి తొలి లీగ్ మ్యాచ్‌లో యుఏఇ మహిళల జట్టు 6వికెట్ల తేడాతో స్కాట్లాండ్పై ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్లు నష్టపోయి 99పరుగులు చేయగా.. యుఏఇ జట్టు 16.2ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 100పరుగులు చేసి గెలిచింది. మహికా గౌర్(33నాటౌట్) బ్యాటింగ్‌లో రాణించింది.టిక గ్రూప్-ఏలో బంగ్లాదేశ్ మహిళల జట్టు 7వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై, శ్రీలంక జట్టు 7 వికెట్ల తేడాతో అమెరికాపై విజయం సాధించాయి.
స్కోర్‌బోర్డు..
దక్షిణాఫ్రికా(అండర్-19) మహిళలు: రెన్స్‌బర్గ్ (సి)ఘోష్ (బి)యాదవ్ 23, లారెన్స్ (రనౌట్) త్రిషా/ఘోష్ 61, సియో (బి)షెఫాలీ వర్మ 0, రెనెకె (సి)త్రిషా (బి)షెఫాలీ 11, ల్యాండ్స్‌మన్ (ఎల్బి)చోప్రా 32, కరాబో మెసో (నాటౌట్) 19, మినే స్మిత్ (నాటౌట్) 16, అదనం 4. (20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 166పరుగులు.
వికెట్ల పతనం: 1/56, 2/61, 3/89, 4/126, 5/142
బౌలింగ్: షబ్నమ్ 1-0-20-0, సోనమ్ యాదవ్ 4-0-47-1, అర్చనా దేవి 3-0-18-0, షెఫాలీ వర్మ 4-0-31-2, సోనియా 3-0-19-0, పర్షవీ చోప్రా 4-0-15-1, సౌమ్య తివారి 1-0-16-0
ఇండియా(అండర్-19) మహిళలు:
శ్వేత సెహ్రావత్ (నాటౌట్) 92, షెఫాలీ వర్మ (సి)నాయుడు (బి)స్మిత్ 45, త్రీషా (స్టంప్) మెసో (బి)నాయుడు 15, తివారీ (సి)రెన్స్‌బర్గ్ (బి)ల్యాండ్మన్ 10, సోనియా (నాటౌట్) 1, అదనం 7. (16.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి) 170పరుగులు.
వికెట్ల పతనం: 1/77, 2/106, 3/165
బౌలింగ్: అయంద హుబి 4-0-36-0, నాయుడు 3-0-32-1, రెనెకె 4-0-40-0, నిని 1-0-26-0, స్మిత్ 2-0-15-1, ల్యాండ్మన్ 2.3-0-20-1.