Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియన్ ఓపెన్
మెల్బోర్న్ : టైటిల్ ఫేవరేట్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) దూకుడు పెంచాడు. మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్లో నాల్గో సీడ్ జకోవిచ్ మెరుపు విజయం సాధించాడు. 6-1, 6-7(5-7), 6-2, 6-0తో ఫ్రాన్స్ చిన్నోడు ఎంజోను చిత్తు చేశాడు. వరల్డ్ నం.191 ఎంజో రెండో సెట్‌ను టైబ్రేకర్‌లో నెగ్గి సత్తా చాటినా.. సెర్బియా యోధుడి అలవోక విజయంతో మూడో రౌండ్లో అడుగుపెట్టాడు. దిమిత్రివ్ 6-3, 6-2, 6-0తో రెండో రౌండ్లో నెగ్గగా.. జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌కు చుక్కెదురైంది. 7-6(1-7), 4-6, 3-6, 2-6తో అమెరికా ఆటగాడి చేతిలో ఓటమి చెందాడు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ జెబూర్ 1-6, 7-5, 1-6తో వండ్రుసోవా చేతిలో మట్టికరిచింది. ఐదో సీడ్ సబలెంకా 6-3, 6-1తో షెల్బీ రోజర్స్‌ను ఓడించి మూడో రౌండ్‌కు చేరుకుంది.