Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్
న్యూఢిల్లీ : కొత్త ఏడాదిలో భారత షట్లర్ల నిరాశజనక ప్రదర్శన కొనసాగు తోంది. ఇండియా ఓపెన్ సిరీస్‌లో భారత క్రీడాకారుల టైటిల్ వేటకు తెరపడింది. మెన్స్ సింగిల్స్‌లో లక్ష్యసేన్, మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ క్వార్టర్‌ఫైనల్‌కు ముందే పరాజయం పాలయ్యారు. మెన్స్ డబుల్స్‌లో సాత్విక్, చిరాగ్ జోడీ గాయంతో వాకోవర్ ఇవ్వగా.. మహిళల సింగిల్స్‌లో గాయత్రి, ట్రెసా జంట ఓటమి చెందింది. ఏడో సీడ్ లక్ష్యసేన్ 21-16, 15-21, 18-21తో డెన్మార్క్ షట్లర్ రాస్మస్ గెమ్కే చేతిలో మూడు గేముల్లో ఓటమి పాలయ్యాడు. తొలి గేమ్ నెగ్గిన లక్ష్యసేన్ చివరి రెండు గేముల్లో పోరాడి ఓడాడు. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ వరుస గేముల్లో చేతులెత్తేసింది. మూడో సీడ్ చైనా షట్లర్ చెన్ యుఫెరు 21-9, 21-12తో సైనా నెహ్వాల్‌పై అలవోక విజయం నమోదు చేసింది. మెన్స్ డబుల్స్‌లో కృష్ణ ప్రసాద్, విష్ణువర్ధన్ జోడీ 14-21, 10-21తో చైనా జోడీ చేతిలో కంగుతింది. మహిళల డబుల్స్‌లో గాయత్రి పుల్లెల, ట్రెసా జాలీ 9-21, 16-21తో చైనా అమ్మాయిలకు క్వార్టర్‌ఫైనల్ బెర్త్ కోల్పోయారు. మెన్స్ డబుల్స్‌లో సాత్విక్, చిరాగ్ జోడీకి విజయావకాశాలు మెరుగ్గా కనిపించాయి. కానీ గాయంతో భారత డబుల్స్ స్టార్ వాకోవర్ ఇచ్చారు. దీంతో ఇండియా ఓపెన్‌లో భారత షట్లర్ల పోరాటానికి తెరపడింది.