Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 9 వికెట్లతో మహారాష్ట్ర గెలుపు
పుణె : రంజీ ట్రోఫీలో హైదరాబాద్ చెత్త ప్రదర్శనకు బ్రేక్ పడలేదు. ఆరు మ్యాచుల్లో ఐదో పరాజయం మూటగట్టుకున్న హైదరాబాద్ మరోసారి మూడు రోజుల్లోనే ప్రత్యర్థికి దాసోహం అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో 385 పరుగుల భారీ స్కోరు నమోదు చేసిన మహారాష్ట్ర.. హైదరాబాద్‌ను వరుసగా 192, 219 పరుగులకు ఆలౌట్ చేసింది. భారీ తొలి ఇన్నింగ్స్ లోటుతో ఫాలోఆన్ ఆడిన హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగుల మార్క్ దాటగలిగింది. సంతోశ్ (59), తన్మరు (43), రోహిత్ రాయుడు (37) చెప్పుకోదగిన పరుగులు చేశారు. 27 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 2.5 ఓవర్లలోనే ఛేదించిన మహారాష్ట్ర 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బి చివరి మ్యాచ్‌లో ఢిల్లీతో హైదరాబాద్ ఆడనుంది.