Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయిపై చారిత్రక విజయం
న్యూఢిల్లీ : రంజీ ట్రోఫీలో ఢిల్లీ చరిత్ర సృష్టించింది!. 43 ఏండ్లలో తొలిసారి ముంబయిపై రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఓ విజయం రుచి చూసింది. 1979-80 రంజీ సీజన్ నుంచి ముంబయి, ఢిల్లీలు 20 మ్యాచుల్లో తలపడ్డాయి. ఈ మ్యాచు లను ఢిల్లీ డ్రా, ఓటమితో ముగిం చింది. సెలక్షన్ ప్రక్రియ రచ్చకెక్కగా ఈ సీజన్లో ఢిల్లీ రంజీ జట్టు హైదరాబాద్ తరహాలో చెత్త ప్రదర్శన చేసింది. కానీ ఆరో రౌండ్ మ్యాచ్‌లో ముంబయిపై ఢిల్లీ మాయ చేసింది. నాల్గో రోజు ఆటలో 95 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 2 రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. బ్యాటర్లు దూకుడుగా రాణించటంతో తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులు చేసిన ఢిల్లీ.. అంతకముందు ముంబయిని తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులకు ఆలౌట్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ముంబయి 170 పరుగులకే కుప్ప కూలగా, ఢిల్లీ 43 ఏండ్లలో తొలిసారి రంజీ ట్రోఫీ 41 సార్లు చాంపియన్ ముంబయిపై జయభేరి మోగించింది. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బి చివరి రౌండ్ మ్యాచ్‌లో హైదరాబాద్‌తో ఢిల్లీ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది.