Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత
హైదరాబాద్ : ఉత్కంఠగా సాగిన హైదరాబాద్ వన్డేలో టీమ్ ఇండియా విజ యం సాధించినా, మ్యాచ్ ఫీజులో భారీ మొత్తాన్ని కోల్పోయింది. భారత్, న్యూజి లాండ్ తొలి వన్డేలో ఆతిథ్య జట్టు స్లో ఓవర్‌రేట్ కింద జరిమానాకు గురైంది. ఐసీసీ క్రమశిక్షణ నియామవళి ప్రకారం ఆర్టికల్ 2.22 కింద నిర్దేశిత సమయానికి భారత్ 3 ఓవర్లు వెనుకంజలో నిలిచింది. నిబంధనల ప్రకారం ఆలస్యమైన ప్రతి ఓవర్‌కు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తారు. ఈ లెక్కన భారత క్రికెటర్ల మ్యాచ్ ఫీజులో ఏకంగా 60 శాతం మొత్తాన్ని జరిమానాగా విధించారు. ఫీల్డ్ అంపైర్లు నితిన్ మీనన్, అనిల్ చౌదరి సహా థర్డ్ అంపైర్ కెఎన్ అనంత పద్మనాభం, ఫోర్త్ అంపైర్ జయరామన్ మదన్‌గోపాల్ నివేదిక మేరకు..మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ విధించిన జరిమానాను భారత కెప్టెన్ రోహిత్ శర్మ అంగీకరించాడు. దీంతో ఈ అంశంలో ఎటువంటి విచారణ ఉండదని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.