Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రీ క్వార్టర్స్‌లో ఇగా స్వైటెక్
- ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
మెల్బోర్న్ : ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్లో సంచలనాల మోత మోగుతోంది. స్పెయిన్ బుల్ రఫెల్ ఇదివరకే నిష్క్రమించగా, తాజాగా 2021, 2022 రన్నరప్ డానిల్ మెద్వదేవ్ (రష్యా) సైతం ఇంటిముఖం పట్టాడు. మెన్స్ సింగిల్స్ మూడో రౌండ్లో అమెరికా ఆటగాడు సెబాస్టియన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. 7-6(9-7), 6-3, 7-6(7-4)తో వరుస సెట్లలో మెద్వదేవ్‌పై సెబాస్టియన్ సంచలన విజయం సాధించాడు. జపాన్ ఆటగాడు నిషియోక ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. నడాల్‌ను ఓడించిన మెక్‌డొనాల్డ్‌పై 7-6(8-6), 6-3, 6-2తో వరుస సెట్లలో గెలుపొందాడు. గ్రీసు స్టార్ స్టెఫానోస్ సిట్సిపాస్ 6-2, 7-6(7-5), 6-3తో వరుస సెట్లలో టాల్లాన్పై విజయంతో ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. జానిక్ సిన్నర్ ఐదు సెట్ల పోరులో 4-6, 4-6, 6-1, 6-2, 6-0తో మార్టన్పై మెరుపు విజయం సాధించాడు.
మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ ఇగా స్వైటెక్ 6-0, 6-1తో అలవోక విజయం సాధించింది. స్పెయిన్ భామ క్రిస్టినాను చిత్తుగా ఓడించి ప్రీ క్వార్టర్స్‌లో కాలు మోపింది. అమెరికా చిన్నది కోకో గాఫ్ 6-3, 6-2తో సహచర క్రీడాకారిణి బెర్నార్డా పెరాపై గెలుపొందింది. విక్టోరియా అజరెంక 1-6, 6-2, 6-1తో అమెరికా స్టార్ మడిసన్ కీస్పై గెలుపొందింది. మూడో సీడ్ జెస్సికా పెగులా 6-0, 6-2తో మార్టాను మట్టికరిపించింది.