Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బరిలో లక్ష్యసేన్, సైనా నెహ్వాల్
- నేటి నుంచి ఇండోనేసియా ఓపెన్
జకర్తా : కొత్త ఏడాదిని భారత షట్లర్లు నిరాశగా మొదలెట్టారు. ఇండియా ఓపెన్‌లో భారత టైటిల్ వేటకు క్వార్టర్ఫైనల్స్కు ముందే తెరపడింది. సింధు, సైనా, లక్ష్యసేన్, శ్రీకాంత్‌లు నిరాశపరిచారు. పి.వి సింధు ఈ వారం విశ్రాంతి తీసుకోగా.. సాత్విక్, చిరాగ్ జోడీ గాయం బారిన పడ్డారు. లక్ష్యసేన్, సైనా నెహ్వాల్ సహా యువ షట్లర్లు అందరూ ఇండోనేషియా ఓపెన్ బరిలో నిలిచారు. మంగళవారం నుంచి ఇండోనేషియా ఓపెన్ ఆరంభం కానుండగా, భారత షట్లర్లకు కాస్త కఠిన డ్రా ఎదురైంది. మెన్స్ సింగిల్స్‌లో లక్ష్యసేన్ తొలి రౌండ్లో జపాన్ షట్లర్ కొడారు నరోకతో తలపడనున్నాడు. మలేషియా ఓపెన్ ఫైనల్స్‌కు చేరిన కొడారు ప్రస్తుతం సంచలన ఫామ్‌లో ఉన్నాడు. ఎనిమిదో సీడ్ హెచ్.ఎస్ ప్రణరు ఆరంభ మ్యాచ్‌లో జపాన్ షట్లర్ కెంటా సునేమియాతో పోటీపడనున్నాడు. మలేషియా ఓపెన్ క్వార్టర్స్‌కు చేరిన ప్రణరు మరోసారి మెరుపు ప్రదర్శనపై కన్నేశాడు. మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ అగ్ర షట్లర్ విక్టర్ అక్సెల్సెన్తో ఢకొీట్టనున్నాడు. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ మంచి ప్రదర్శన ఆశిస్తోంది. ఇండియా ఓపెన్‌లో ఆకట్టుకున్న సైనా.. జకర్తాలో తొలి మ్యాచ్‌లో చైనీస్ తైపీ షట్లర్‌తో ఆడనుంది. ఇండోనేషియా స్టార్ రచనోక్ ఇంటనాన్‌తో యువ షట్లర్ మాళవిక బాన్సోద్ అమీతుమీ తేల్చుకోనుంది.