Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల ఐపీఎల్ ప్రాంఛైజీల వేలం
ముంబయి : మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూఐపీఎల్) ప్రాంఛైజీలను దక్కించుకునే రేసులో ఐపీఎల్ ప్రాంఛైజీలు ముందంజలో నిలిచాయి!. 2023 మహిళల ఐపీఎల్ సీజన్‌కు బీసీసీఐ రంగం సిద్ధం చేస్తుండగా.. ప్రాంఛైజీల వేలానికి జనవరి 23 నుంచి అసలు ప్రక్రియ మొదలైంది. సోమవారం రోజు ఐటీటీ కొనుగోలు చేసిన సంస్థలు టెక్నికల్ బిడ్లు దాఖలు చేశాయి. బుధవారం (జనవరి 25) ఫైనాన్షియల్ బిడ్లను ప్రకటించనున్నారు. గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం సీవీసీ క్యాపిటల్స్ అనుభవం దృష్ట్యా మహిళల ఐపీఎల్‌కు టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్లను వేర్వేరు రోజుల్లో నిర్వహిస్తున్నారు.
మహిళల ఐపీఎల్లో ఐదు ప్రాంఛైజీల కోసం గట్టి పోటీ కనిపిస్తోంది. ఐపీఎల్ జట్లు ముంబయి ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, కోల్‌కత నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిల్స్, రాజస్థాన్ రాయల్స్ ప్రాంఛైజీ యాజమాన్యాలు మహిళల ఐపీఎల్ జట్లను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇవి కాకుండా.. శ్రీరామ్ గ్రూప్, నీల్గిరి గ్రూప్, ఏడబ్ల్యూ కొటాఠి గ్రూప్, ఏపీఎల్ అపోలో, హాల్దిరామ్, చెట్టినాడ్ సిమెంట్, జెకె సిమెంట్, కాప్రి గ్లోబల్, ది నామన్ గ్రూప్, ఉదరు కొటక్ గ్రూపులు మహిళల ఐపీఎల్ ప్రాంఛైజీలను కొనుగోలు చేసేందుకు వేలంలో పోటీపడనున్నాయి. చెన్నై సూపర్‌కింగ్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్‌జెయింట్స్ వంటి మెగా ఐపీఎల్ ప్రాంఛైజీలు ఆశ్చర్యకంగా మహిళల ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాయి.