Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు తమళనాడుతో సౌరాష్ట్ర ఢీ
నవతెలంగాణ, హైదరాబాద్
భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దేశవాళీ సర్క్యూట్లో సందడి చేయనున్నాడు. లిగమెంట్ గాయంతో సుమారు ఐదు నెలలు క్రికెట్‌కు దూరంగా ఉన్న రవీంద్ర జడేజా.. రానున్న భారత్, ఆస్ట్రేలియా బోర్డర్- గవాస్కర్ టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. మ్యాచ్ ఫిట్నెస్ నిరూపించుకునేం దుకు రంజీ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమయ్యాడు. రంజీ ట్రోఫీ చివరి రౌండ్లో నేటి నుంచి సౌరాష్ట్ర, తమిళనాడు తలపడనున్నాయి. ఎలైట్ గ్రూప్-బి నుంచి సౌరాష్ట్ర ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్కు అర్హత సాధించింది. అయినా, నాకౌట్ దశకు ముందు తమిళనాడుతో పరిపూర్ణ ప్రదర్శనపై ఆ జట్టు కన్నేసింది. రవీంద్ర జడేజా రాకతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి రెట్టింపు అయ్యింది. కెప్టెన్ ఉనద్కత్, చతేశ్వర్ పుజారా తమిళనాడుతో మ్యాచ్‌కు అందుబాటులో లేరు. తమిళనాడుతో మ్యాచ్‌కు ముందు చెన్నైలోని ఎం.ఏ చిదంబరం స్టేడియంలో జడేజా కఠోర సాధన చేశాడు. 'మళ్లీ మైదానంలో అడుగుపెట్టడం బాగుంది. రంజీ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. జట్టుగా, వ్యక్తిగతంగా ఈ మ్యాచ్ బాగుంటుందని ఆశిస్తున్నాను. గాయంతో ఐదు నెలలు ఆటకు దూరమయ్యాను. 100 శాతం మ్యాచ్ ఫిట్నెస్ సాధించటమే నా తొలి ప్రాధాన్యత. ఫిట్నెస్ పరంగా ఆ స్థాయికి చేరుకుంటే ఆ తర్వాత నైపుణ్యంపై దృష్టి పెట్టవచ్చు. ఎన్సీఏలో 20 రోజులు ఉన్నాను. బ్యాటింగ్, బౌలింగ్ సౌకర్యవంతంగా చేస్తున్నాను. కానీ మ్యాచ్ పరిస్థితులు పూర్తి భిన్నం. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు ఓ మ్యాచ్ అనుభవం అవసరం అనిపించింది. అందుకే రంజీ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమయ్యాను' అని రవీంద్ర జడేజా తెలిపాడు.
హైదరాబాద్, ఢిల్లీ పోరు : రంజీ ట్రోఫీలో సీజన్ చివరి మ్యాచ్‌కు హైదరాబాద్ రంగం సిద్ధం చేసుకుంది. ఎలైట్ గ్రూప్-బిలో అయిదు పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిన హైదరాబాద్ నేడు ఉప్పల్ స్టేడియం వేదికగా ఢిల్లీతో ఢకొీట్టనుంది. ఈ సీజన్లో హైదరాబాద్, ఢిల్లీ ప్రదర్శన ఒకే తరహాలో సాగింది. రెండు జట్ల సెలక్షన్ ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. చెత్త ప్రదర్శనలో పోటీపడుతున్న హైదరాబాద్, ఢిల్లీ నేడు ముఖాముఖికి సై అంటున్నాయి. సీజన్ చివరి మ్యాచ్‌లోనైనా మెరుగైన ప్రదర్శన చేసేందుకు హైదరాబాద్ పోరాట స్ఫూర్తి చూపిస్తుందేమో చూడాలి