Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్‌తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ
మెల్‌బోర్న్ : బోర్డర్- గవాస్కర్ టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు ఫిబ్రవరి 1న భారత పర్యటనకు బయల్దేరనుంది. నాలుగు టెస్టుల సిరీస్ ముంగిట సిడ్నీలో ఆప్షనల్ సన్నాహాక శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. శిక్షణ శిబిరం అనంతరం ఆస్ట్రేలియా క్రికెటర్లు నేరుగా బారత్‌కు చేరుకోనున్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టు ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్‌లో ఆరంభం కానుండగా.. రెండో టెస్టు న్యూఢిల్లీ (ఫిబ్రవరి 17), మూడో టెస్టు ధర్మశాల (మార్చి 1), నాల్గో టెస్టు అహ్మదాబాద్ (మార్చి 9)లో జరుగనున్నాయి. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకునే క్రమంలో భారత్‌కు ఈ నాలుగు టెస్టులు అత్యంత కీలకం. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇదే చివరి నాలుగు టెస్టుల సిరీస్ కానుంది. తర్వాతి బోర్డర్-గవాస్కర్ సిరీస్ నుంచి ఐదు టెస్టులు ఉండనున్నాయి. టెస్టు సిరీస్ అనంతరం ఆసీస్‌తో భారత్ మూడు వన్డేలు ఆడనుంది. ముంబయి (మార్చి 17), విశాఖపట్నం (మార్చి 19), చెన్నై (మార్చి 22) వన్డేలకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.