Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీతో రంజీ ట్రోఫీ మ్యాచ్
నవతెలంగాణ, హైదరాబాద్ : రంజీ ట్రోఫీ చివరి మ్యాచ్‌లో హైదరాబాద్ ఆకట్టుకునే ప్రదర్శన చేస్తుంది. ఎలైట్ గ్రూప్-బి చివరి రౌండ్ పోరులో ఢిల్లీపై భారీ స్కోరు దిశగా సాగుతుంది. తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన హైదరాబాద్ తొలి రోజు 247/4తో మంచి స్థితిలో నిలిచింది. చందన్ సహాని (67, 126 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కలిసి నాల్గో వికెట్‌కు రోహిత్ రాయుడు (90 నాటౌట్, 197 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) విలువైన 132 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. రోహిత్ రాయుడు, చందన్ సహాని రాణించటంతో ఢిల్లీ బౌలర్లు వికెట్ల వేటలో వెనుకంజ వేశారు. కెప్టెన్ తన్మరు (23), నితీశ్ (0) నిరాశపరిచారు. రాహుల్ (41) ఫర్వాలేదనిపించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సంతోశ్ గౌడ్ (10 నాటౌట్)తో కలిసి రోహిత్ అజేయంగా నిలిచాడు.
ఇక రంజీ ట్రోఫీ రీ ఎంట్రీలో జడేజాకు వికెట్ దక్కలేదు. తమిళనాడుతో మ్యాచ్‌లో 17 ఓవర్లు సంధించిన జడేజా 36 పరుగులకు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. సాయి సుదర్శన్ (45), బాబ అపరాజిత్ (45), బాబ ఇంద్రజిత్ (45 నాటౌట్) రాణించగా తొలి రోజు తమిళనాడు 183/4తో కొనసాగుతోంది.