Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కివీస్‌తో టీ20 సిరీస్‌కు దూరం
ముంబయి : భారత యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాయానికి గురయ్యాడు. టీమ్ ఇండియా టీ20 ప్రణాళిల్లో కీలకంగా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ మణికట్టు గాయంతో న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌కు దూరమయ్యాడు. చికిత్స, రిహాబిలిటేషన్ నిమిత్తం బెంగళూర్‌లోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కి రుతురాజ్ చేరుకున్నాడు. రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ మణికట్టు నొప్పిపై బీసీసీఐ వైద్య బృందానికి ఫిర్యాదు చేశాడు. శ్రీలంకతో టీ20 మ్యాచ్‌కు సైతం రుతురాజ్ గైక్వాడ్ ఇటువంటి కారణంతోనే దూరమయ్యాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు కోవిడ్-19 మహమ్మారితో ఆడలేకపోయాడు. వరుసగా పలు వైద్య కారణాలతో రుతురాజ్ గైక్వాడ్ జాతీయ జట్టుకు దూరం కావటం పట్ల జట్టు మేనేజ్మెంట్ అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేయలేదు. ముంబయి స్టార్ పృథ్వీ షా అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇదిలా ఉండగా, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఫిట్‌నెస్‌పై బీసీసీఐ ఫిబ్రవరి నివేదిక అందుకోనుంది. ఆస్ట్రేలియా, భారత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు రంజీ ట్రోఫీలో మ్యాచ్ ఫిట్నెస్ నిరూపించుకునేందుకు రవీంద్ర జడేజా ప్రస్తుతం తమిళనాడుతో రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. తమిళనాడుతో రంజీ మ్యాచ్ అనంతరం రవీంద్ర జడేజా నేరుగా బెంగళూర్‌లోని ఎన్సీఏకు చేరుకోనున్నాడు. అక్కడ రవీంద్ర జడేజాకు ఫిట్నెస్ పరీక్ష నిర్వహించి తుది నివేదికను బోర్డుకు అందించనున్నారు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ముంగిట భారత శిక్షణ శిబిరం నాగ్‌పూర్‌లో ఫిబ్రవరి 2 నుంచి ఆరంభం కానుంది. ఫిబ్రవరి 1న రవీంద్ర జడేజా ఫిట్‌నెస్‌పై ఓ స్పష్టత రానుంది.