Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీతో రంజీ మ్యాచ్
నవతెలంగాణ,హైదరాబాద్
రంజీ ట్రోఫీలో ఆరో పరాజయం దిశగా హైదరాబాద్ సాగుతోంది!. ఎలైట్ గ్రూప్-బిలో చివరి మ్యాచ్‌లో హైదరాబాద్ ఓటమి అంచున నిలిచింది. రోహిత్ రాయుడు (153) సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 355 పరుగులు చేసింది. ఆయుశ్ బదాని (191) శతకంతో తొలి ఇన్నింగ్స్‌లో ఢిల్లీ 433 పరుగులు చేసి విలువైన ఆధిక్యం దక్కించుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ బ్యాటర్లు చేతులేత్తేశారు. 31 ఓవర్లలో 90 పరుగులకు హైదరాబాద్ 5 వికెట్లు కోల్పోయింది. తన్మరు (11), రాహుల్ (6), రోహిత్ (32), నితీశ్ (0), చందన్ (0) విఫలమయ్యారు. ప్రస్తుతం 12 పరుగుల ఆధిక్యంలో నిలిచిన హైదరాబాద్ నేడు చివరి రోజు ఆటలో ఢిల్లీ బౌలర్లను ఎదురొడ్డి నిలువటం అసాధ్యం. నేడు తొలి సెషన్లో హైదరాబాద్ చివరి ఐదు వికెట్లు నిలుపుకుంటే అదే గొప్ప!. ఇక విజయంతో సీజన్‌ను ముగించేందుకు ఢిల్లీ రంగం సిద్ధం చేసుకుంది.