Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ది ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కీలక సమాy ేశానికి సిద్ధం కానుంది. ఫిబ్రవరి 4న బహ్రె యిన్‌లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. ఈ భేటీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో పాటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) హాజరు కానున్నాయి. దాయాది దేశాల క్రికెట్ బోర్డులు భేటీకి రానుండటంతో సమావేశ వాతావరణం కాస్త వేడెక్కనుంది. 2023 ఆసియా కప్ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ దక్కించుకుంది. ఆగస్టు-సెప్టెంబర్‌లో ఆసియా కప్ నిర్వహించాల్సి ఉంది. ఇరు దేశాల నడుమ ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించిన తరుణంలో పాక్‌లో పర్యటించేందుకు భారత జట్టు సుముఖంగా లేదు. దీంతో ఆసియా కప్ కోసం పాక్‌లో అడుగుపెట్టమని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. అదే జరిగితే, భారత్‌లో జరిగే 2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ను బహిష్కరిస్తామని అప్పటి పీసీబీ చైర్మెన్ రమీజ్ రాజా ఘాటుగా స్పందించారు. పీసీబీ చైర్మెన్‌గా నజం సేథి బాధ్యతలు తీసుకున్నప్పటికీ ఆ బోర్డు వైఖరిలో మార్పు వచ్చినట్టు కనిపించటం లేదు. దీంతో ఇప్పుడు ఆసియా క్రికెట్ కౌన్సిల్ వేదికగా బీసీసీఐ, పీసీబీ తాడోపేడో తేల్చుకునే అవకాశం ఉంది. ఆసియా కప్ వేదికపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.