Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్‌లో కివీస్‌పై ఏకపక్ష విజయం
- ఐసీసీ అండర్-19 టీ20 ప్రపంచకప్
జొహనెస్‌బర్గ్ : అమ్మాయిలకు ఎదురు లేదు. సమిష్టి ప్రదర్శన, ఏకపక్ష విజయాలతో ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా అండర్-19 జట్టు ఫైనల్లోకి చేరుకుంది. శుక్రవారం జరిగిన సెవీ ుఫైనల్లో న్యూజిలాండ్ అండర్-19 అమ్మాయి లపై షెఫాలీ వర్మ సేన అదిరే విజయం నమోదు చేసింది. 108 పరుగుల లక్ష్యాన్ని మరో 34 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన భారత్ అమ్మాయిలు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్ టైటిల్ కోసం పోటీపడనుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ అండర్-19 స్పిన్నర్ పర్శవి చోప్రా (3/20) మాయకు 107/9 పరుగులే చేసింది. ప్లిమర్ (35), ఇస బెల్ల (26) రాణించటంతో కివీస్ వంద పరు గులు చేసింది. స్వల్ప లక్ష్యాన్ని భారత్ 14.2 ఓవర్లలోనే ఊదేసింది. ఓపెనర్ శ్వేత షెరావత్ (61 నాటౌట్, 45 బంతుల్లో 10 ఫోర్లు) ధనాధన్ అర్ధ సెంచరీతో దంచి కొట్టింది. సౌమ్య తివారి (22) రాణించింది. 3 వికెట్లతో మాయ చేసిన పర్శవి చోప్రా 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకుంది.