Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాంచి టీ20లో భారత్ ఓటమి
- 1-0తో సిరీస్‌లో కివీస్ ముందంజ
నవతెలంగాణ-రాంచి : భారత పర్యటనలో న్యూజిలాండ్ బోణీ కొట్టింది. రాంచి టీ20లో భారత్‌పై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. మంచు ప్రభావంలోనూ 176 పరుగుల స్కోరును కాపాడుకున్న కివీస్ బౌలర్లు.. టీ20 సిరీస్‌లో ఆ జట్టును 1-0తో ముందంజలో నిలిపారు. స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ (2/11), మైకల్ బ్రాస్‌వెల్ (2/31), లాకీ ఫెర్గుసన్ (2/33) రాణించటంతో 177 పరుగుల ఛేదనలో భారత్ 155 పరుగులకే పరిమితమైంది. వాషింగ్టన్ సుందర్ (50, 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్ (47, 34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాటం సరిపోలేదు. అంతకుముందు, టాప్ ఆర్డర్లో ఓపెనర్ డెవాన్ కాన్వే (52, 23 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), లోయర్ ఆర్డర్లో డార్లీ మిచెల్ (59 నాటౌట్, 30 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో చెలరేగారు. టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ ఆదివారం లక్నోలో జరుగనుంది.
బ్యాటర్లు విఫలం
177 పరుగుల ఛేదనలో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. గిల్ (7), కిషన్ (4), త్రిపాఠి (0) కొత్త బంతిని ఎదుర్కొవటంలో తేలిపోయారు. సూర్యకుమార్ (47), హార్దిక్ పాండ్య (21) కీలక భాగస్వామ్యంతో భారత్‌ను రేసులోకి తీసుకొచ్చారు. కానీ వరుస వికెట్లు మళ్లీ భారత్‌ను దెబ్బతీసింది. వాషింగ్టన్ సుందర్ (50) అర్థ సెంచరీ సాధించినా, అప్పటికే భారత్ ఓటమి ఖరారైంది. దీపక్ హుడా (10) ఒత్తిడిలో రాణించలేకపోయాడు. 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులే చేసిన భారత్ 21 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
డార్లీ, కాన్వే జోరు
టాస్ నెగ్గిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన న్యూజిలాండ్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు ఫిన్ అలెన్ (35), డెవాన్ కాన్వే (52) తొలి వికెట్‌కు 43 పరుగులు జోడించారు. 4 ఫోర్లు, 2 సిక్సర్లతో జోరందుకున్న అలెన్‌ను, మార్క్ చాప్మన్ (0)ను అవుట్ చేసిన వాషింగ్టన్ సుందర్ భారత్‌కు బ్రేక్ సాధించాడు. గ్లెన్ ఫిలిప్స్ (17) నెమ్మదిగా ఆడగా.. అర్థ సెంచరీ అనంతరం కాన్వే వికెట్ కోల్పోయాడు. లోయర్ ఆర్డర్లో డార్లీ మిచెల్ (59 నాటౌట్) ధనాధన్ విశ్వరూపం కివీస్‌కు భారీ స్కోరు అందించింది. అర్షదీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టిన డార్లీ మిచెల్.. ఆ ఓవర్లో ఏకంగా 27 పరుగులు పిండుకున్నాడు.
స్కోరు వివరాలు :
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : 176/6 ( డార్లీ మిచెల్ 59, డెవాన్ కాన్వే 52, వాషింగ్టన్ సుందర్ 2/22)
భారత్ ఇన్నింగ్స్ : 155/9 ( సూర్యకుమార్ 47, వాషింగ్టన్ 50, శాంట్నర్ 2/11, బ్రాస్‌వెల్ 2/31)