Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియన్ ఓపెన్ పదో టైటిల్ కైవసం
- 22 గ్రాండ్ స్లామ్‌లతో నాదల్ రికార్డు సమం
సిడ్నీ : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ విజయ ఢంకా మోగించారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ విభాగంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ పదో టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. జకోవిచ్ తొలి సెట్లోనే స్టెఫానోస్ సిట్సిపాస్‌ను బ్రేక్ చేసి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. రెండో సెట్ స్టెఫానోస్ మెగైన ప్రదర్శన కనబరిచినప్పటికీ జకోవిచ్ విజయం సాధించడంతో గేమ్‌ను ట్రైబేకర్‌కు తీసుకువెళ్లాడు. మూడోసెట్లో జకోవిచ్ 7-6తో టై బ్రేకర్‌లో స్టెఫానోస్‌ను ఓడించి 10వ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. మొత్తంగా 6-3, 7-6, 7-6 తేడాతో విజయం సాధించారు. జకోవిచ్ తన 22 గ్రాండ్ స్లామ్‌లతో నాదల్ రికార్డును సమం చేశారు. కరోనా వ్యాక్సిన్ వ్యవహారం నేపథ్యంలో ఆస్ట్రేలియాకు వెళ్లి మరీ గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడకుండా నాదల్ వెనుతిరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు తన అద్భుతమైన ఆట తీరుతో టైటిల్‌ను కైవసం చేసుకోవడం గమనార్హం. ఇటు అగ్రశ్రేణి ఆటగాడు నాదల్ గాయం కారణంగా ఆదిలోనే ఇంటి బాట పట్టడం కూడా జకోవిచ్‌కు కలిచి వచ్చిన అంశం.