Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొట్టమొదటి అండర్ -19 మహిళల టీ20 ప్రపంచకప్ సొంతం
- ఫైనల్లో ఇంగ్లండ్‌పై 7 వికెట్ల తేడాతో విజయం
- బీసీసీఐ రూ. 5 కోట్ల రివార్డు
పొట్చెఫ్స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా) : ఐసీసీ మొట్టమొదటి సారిగా నిర్వహించిన అండర్ 19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌ను భారత్ కైవసం చేసుకున్నది. అమ్మాయిలు అద్బుత ప్రదర్శన కనబర్చడంతో భారత్ జగజ్జేతగా అవతరించింది. సమిష్టి కృషితో ఫైనల్లో ఇంగ్లండ్‌పై విజయంతో టీమిండియా తన పేరును చరిత్రలో లిఖిం చుకున్నది. ఆదివారం దక్షిణాఫ్రికాలోని పొట్చె ఫ్స్ట్రూమ్ సెన్యూస్ పార్కులో భారత్ - ఇంగ్లండ్ దేశాల మధ్య ఫైనల్ పోరు జరిగింది. ఈ మ్యాచ్‌లో యువ భారత జట్టు ఇంగ్లండ్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి ఈ ఘటనతను సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రత్యర్థి జట్టును కేవలం 68 పరుగులకు భారత్ కట్టడి చేసింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత్ బరిలోకి దిగింది. 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరింది. షెఫాలీ వర్మ (15), శ్వేత్ సెహ్రావత్ (5), తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (24) పెవిలియన్‌కు చేరగా.. సౌమ్య తివారి (23), హ్రిషత బసు టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. ఇంగ్లండ్ బౌలర్లలో హన్నా బేకర్, కెప్టెన్ గ్రేస్ స్కీవెన్స్, అలెక్సా స్టోన్‌హౌస్ తలో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. భారత బౌలర్లు మూకుమ్మడిగా విజంభించడంతో 68 పరుగులకే చాపచుట్టేసింది. టిటాస్ సాధు, అర్చనా దేవీ, పర్శవి చోప్రా తలో 2 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ వెన్నువిరచగా.. మన్నత్ కశ్యప్, షెఫాలీ వర్మ, సోనమ్ యాదవ్ చెరో వికెట్ తీసి తమ పాత్రకు న్యాయం చేశారు. టీ20 ఫార్మాట్లో జరిగిన తొలి వరల్డ్‌కప్‌ను భారత అమ్మాయిలు కైవసం చేసుకోవడంతో భారత అభి మానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇటు బీసీసీఐ అమ్మాయిలు సాధించిన విజయానికి గానూ రూ. 5 కోట్ల నజరానాను ప్రకటించింది.