Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : అంతర్జాతీయ క్రికెట్‌కు మురళీ విజయ్ వీడ్కోలు పలికాడు. భారత్ తరఫున 61 టెస్టులు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడిన మురళీ విజయ్ ఇంటర్నేషనల్ కెరీర్‌ను ముగిస్తున్నట్టు సోమవారం ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో (2008) నాగ్‌పూర్ టెస్టుకు గౌతం గంభీర్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన మురళీ విజయ్ అక్కడ్నుంచి కెరీర్‌ను మొదలుపెట్టాడు. చివరగా 2018 డిసెంబర్ పెర్త్ టెస్టులో భారత్ తరఫున ఆడిన మురళీ విజయ్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌ను సైతం చివరగా 2019లో ఆడాడు. సంప్రదాయ టెస్టు ఓపెనర్‌గా మురళీ విజయ్ తనదైన ముద్ర వేశాడు. టెస్టుల్లో 12 శతకాలు, 15 అర్థ సెంచరీలు సహా 3982 పరుగులు చేశాడు. వన్డేల్లో 339 పరుగులు, టీ20ల్లో 169 పరుగులు సాధించాడు. దృష్టి సారించనున్నాడు.