Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచకప్ వైఫల్యానికి నైతిక బాధ్యత
న్యూఢిల్లీ : భారత హాకీ సీనియర్ మెన్స్ జట్టు చీఫ్ కోచ్ పదవికి గ్రాహమ్ రీడ్ రాజీనామా చేశారు. ఒడిశా వేదికగా ఎఫ్ఐహెచ్ మెన్స్ హాకీ ప్రపంచకప్ ముగిసిన ఓ రోజు వ్యవధిలోనే గ్రాహమ్ రీడ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పతకంపై కన్నేసి బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు అత్యంత నిరాశజనక ప్రదర్శన చేసింది. ప్రపంచకప్‌లో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. హాకీ ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ చీఫ్ కోచ్ గ్రాహమ్ రీడ్ (ఆస్ట్రేలియా), అనలిటికల్ కోచ్ గ్రెగ్ క్లార్క్, సైంటిఫిక్ అడ్వైజర్ మిచెల్ పెంబర్టన్ అధికారికంగా రాజీనామా పత్రాలను హాకీ ఇండియా అధ్యక్షుడు దిలిప్ టర్కీకి అందించారు. ఫిబ్రవరి 12 నుంచి బెంగళూర్‌లో జాతీయ శిక్షణ శిబిరం నేపథ్యంలో ముగ్గురు విదేశీ కోచ్‌లు నోటీసు పీరియడ్‌తో జట్టుతో పని చేయనున్నారు.