Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కామన్వెల్త్ ప్రతినిధులకు జగన్మోహన్ రావు ఆహ్వానం
స్టాకహేోమ్ (స్వీడన్) : ప్రపంచ హ్యాండ్‌బాల్ చాంపి యన్ షిప్‌కు ఆతిథ్యమిస్తున్న స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్‌లో కామన్వెల్త్ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ (సీహెచ్ ఎఫ్) సదస్సు జరిగింది. ఈ సద స్సుకు హాజరైన జాతీయ హ్యాండ్ బాల్ సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు భారత్‌లో హ్యాండ్‌బాల్ అభివృద్దిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ఏడాది జూన్‌లో స్వదేశీ, విదేశీ ఆటగాళ్ల మేళవింపుతో హ్యాండ్‌బాల్ ప్రీమియర్ లీగ్ నిర్వహణకు రంగం సిద్ధమైనట్టు సదస్సులో జగన్మోహన్ రావు తెలిపారు. 8 జట్లతో తొలిసారి నిర్వహిస్తున్న హ్యాండ్‌బాల్ ప్రీమియర్ లీగ్‌కు ప్రపంచ, ఆసియా సహా కామన్వెల్త్ ప్రతినిధులను జగన్మోహన్ రావు ఆహ్వానించారు. ఈ సదస్సులో జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనందీశ్వర్ పాండే కూడా పాల్గొన్నారు.