Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖేలో ఇండియా స్పాన్సర్‌గా స్పోర్ట్స్ ఫర్ అల్ పెట్టుబడి
న్యూఢిల్లీ : క్షేత్రస్థాయిలో క్రీడా భివృద్దికి పని చేస్తున్న స్పోర్ట్స్ ఫర్ అల్ సంస్థ రానున్న ఐదేండ్లలో రూ.12.5 కోట్లు క్రీడాభివృద్దికి ఖర్చు చేయనుంది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ భాగస్వామిగా ఒప్పందం కుదుర్చుకున్న స్పోర్ట్స్ ఫర్ అల్ అందులో భాగంగా ఈ నిధులను వెచ్చించనుంది. ఈ మేరకు భారత క్రీడాప్రాధికార సంస్థ (సారు), స్పోర్ట్స్ ఫర్ అల్ వ్యవస్థాపకులు రిషికేశ్ జోషి ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. గ్రామీణ ప్రాంత యువతలో ప్రతిభాన్వేషణతో ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాల సాధన లక్ష్యం దిశగా స్పోర్ట్స్ ఫర్ ఆల్ పని చేస్తుంది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లక్ష్యం సైతం అదే కావటంతో వచ్చే ఐదేండ్లు ఉమ్మడిగా పని చేసేందుకు నిర్ణయం తీసుకున్నాయి.