Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్ల్యూబిఎఫ్ ర్యాంకింగ్స్
దుబాయ్ : భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పి.వి సింధు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మరో స్థానం పడిపోయింది. గాయంతో ఆరు మాసాల పాటు ఆటకు దూరమైన సింధు.. ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చినా అంచనాలను అందుకోలేదు. ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో (మహిళల సింగిల్స్)లో ఓ స్థానం పడిపోయి 9వ ర్యాంక్‌లో నిలిచింది. వెటరన్ షట్లర్ సైనా నెహ్వాల్ రెండు స్థానాలు ఎగబాకి 26వ ర్యాంక్‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్‌లో యువ షట్లర్ లక్ష్యసేన్ 11వ స్థానంలో నిలిచాడు. మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో లక్ష్యసేన్ ఓ స్థానం మెరుగై టాప్-10కు చేరవయ్యాడు. మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ 16వ స్థానంలో నిలిచాడు. మెన్స్ డబుల్స్‌లో సాత్విక్, చిరాగ్ జోడీ ఆరో స్థానంలో కొనసాగుతుంది. మహిళల డబుల్స్‌లో ట్రెసా జాలి, పుల్లెల గాయత్రి జంట 19వ స్థానం సాధించింది.