Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసీస్‌తో టెస్టు సిరీస్‌పై సునీల్ జోషి
ముంబయి : ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో చోటే లక్ష్యంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బరిలోకి దిగుతోంది భారత్. నాలుగు టెస్టుల సిరీస్ కోసం మరోవైపు ఆస్ట్రేలియా సైతం గొప్పగా సన్నద్ధమవుతోంది. ఆసీస్‌పై టెస్టు విజయం సాధించేందుకు, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని బీసీసీఐ మాజీ సెలక్టర్ సునీల్ జోషి అభిప్రాయపడ్డాడు. ' ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో పిచ్, వేదిక, పరిస్థితులతో సంబంధం లేకుండా కుల్దీప్ను తుది జట్టులోకి తీసుకోవాలి. అశ్విన్, జడేజాల తోడుగా కుల్దీప్ మూడో స్పిన్నర్‌గా ఉండాలి. ఇటీవల కాలంలో కుల్దీప్ ఓవర్లో క్యాచౌట్లు అన్నీ 30 గజాల సర్కిల్‌లోపలే ఉన్నాయి. ఓ బౌలర్ గొప్ప క్రమశిక్షణతో, లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తున్నాడని చెప్పేందుకు ఇదో నిదర్శనం. వికెట్ల వేటలో కుల్దీప్ యాదవ్ అత్యంత ప్రభావితంగా మారాడు. ఆస్ట్రేలియాపై భారత్ టెస్టు సిరీస్ నెగ్గాలంటే.. కచ్చితంగా కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించాలి' అని సునీల్ జోషి అన్నాడు. మణికట్టు స్పిన్నర్ యుజ్వెంద్ర చాహల్ లయ తప్పాడని, వన్డే వరల్డ్‌కప్ జట్టులో సైతం కుల్దీప్ యాదవ్‌కు చోటు ఇవ్వాల్సిన అవసరం ఉందని సునీల్ జోషి వ్యాఖ్యానించాడు.