Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇండోర్: మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న రంజీట్రోఫీ క్వార్టర్‌ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 379పరుగులకు ఆలౌటైంది. ఓవర్ నైట్ స్కోర్ 2వికెట్ల నష్టానికి 262పరుగులతో గురువారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్రప్రదేశ్ జట్టు మరో 117పరుగులు జతచేసి 8వికెట్లు కోల్పోయింది. కీపర్ రికీ బురు(149), కరణ్ షిండే(110) సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ ఔటయ్యాక లలిత్ మోహన్(22) మినహా మరో బ్యాటర్ రాణించలేకపోయారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ ఘోరంగా విఫలమయ్యారు. అనుభవ్ అగర్వాల్‌కు నాలుగు, కార్తికేయ, గౌరవ్ యాదవ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం తొలిఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 4వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. శుభమ్ శర్మ(51) అర్ధసెంచరీకి తోడు ఓపెనర్లు యశ్ దూబే (20), హిమాన్షు(22), పటీధర్(20) ఫర్వాలేదని పించారు. రెండోరోజు ఆట ముగిసే సమయానికి కెప్టెన్ శ్రీవాత్సవ(20), అనుభవ్ అగర్వాల్(0) క్రీజ్‌లో ఉన్నారు. శశికాంంత్‌కు రెండు, నితీశ్ కుమార్, పృథ్వీరాజ్‌కు ఒక్కో వికెట్ దక్కాయి.