Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఖేలో ఇండియా'కు అధిక నిధులు
ఆసియా, పారిస్ ఒలింపిక్స్ సన్నద్ధతకు నామమాత్రమే..
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్లో క్రీడలకు రూ.3,397.32కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటిం చింది. ఇప్పటివరకు ప్రకటించిన బడ్జెట్లలో ఇదే అత్యధికమని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. ఆ నిధులు ఏ మూలకూ సరిపోవని క్రీడా విశ్లేష కులు అంటున్నారు. గత ఏడాది క్రీడలకు రూ.3,062కోట్ల బడ్జెట్ ప్రకటించగా.. ఈసారి రూ.3,397.32 కోట్లుగా అంచనా వేసింది. ఈ ఏడాది చైనా వేదికగా ఆసియా క్రీడలు జరగ నుండగా.. వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్ జరగనున్నాయి. బడ్జెట్‌కు కేటాయిం చిన మొత్తంలో ఖేలో ఇండియా(నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ స్పోర్ట్స్)కే రూ.1,045కోట్లు కేటాయించారు. 2022 లో ఖేలో ఇండియాకు కేటా యించిన మొత్తం (రూ.606కోట్లు)తో పోల్చిచూస్తే ఇది దాదాపు రెండిం తలు. అలాగే నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ (ఎన్ఎస్ ఎఫ్‌స్)కు గత బడ్జెట్లో 280 కోట్లు కేటాయించగా.. ఈసారి దాన్ని రూ.325 కోట్లకు పెంపుదల చేశారు. అలాగే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా), ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(వాడా)తోపాటు నేషనల్ డోప్ టెస్టింగ్ లాబొరేటరీ(ఎన్డిటిఎల్)కు ఈ కేటాయిం పుల్లోనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా నాడాకు రూ.21.73కోట్లు, ఎన్డిటి ఎల్‌కు రూ.19.50కోట్లుతోపాటు వాడాకు రూ.4కోట్లు మంజూరు చేసింది. పైవన్నీ పోను మిగిలిన మొత్తం క్రీడాకారులను సన్నద్ధం సరిపోవని వారంటున్నారు.