Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- థాయ్‌లాండ్ మాస్టర్స్ టోర్నీ
బ్యాంకాక్ : తెలుగు తేజం బి. సాయిప్రణీత్ థాయ్‌లాండ్ మాస్టర్స్ టోర్నీ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్‌ఫైనల్లో దక్షిణ కొరియా షట్లర్‌పై మూడు గేముల మ్యాచ్‌లో మెరుపు విజయం సాధించింది. వరల్డ్ నం.49పై గంట 18 నిమిషాల్లో విజయం నమోదు చేసిన సాయిప్రణీత్ క్వార్టర్‌ఫైనల్లో కఠిన సవాల్ ఎదుర్కొనున్నాడు. ఆరో సీడ్ చైనా షట్లర్ లి షి ఫెంగ్‌తో సాయి ప్రణీత్ నేడు పోటీపడనున్నాడు. 24-22, 7-21, 22-20తో దక్షిణ కొరియా షట్లర్ జెయాన్ హియోంగ్ జిన్ (క్వాలిఫయర్)ను సాయిప్రణీత్ మట్టికరిపించాడు. టైబ్రేకర్‌కు దారితీసిన ప్రీ క్వార్టర్స్‌లో సాయిప్రణీత్ చెమటోడ్చాడు. తొలి గేమ్‌ను టైబ్రేకర్‌లో 24-22తో గెలుపొందగా.. నిర్ణయాత్మక గేమ్‌ను సైతం 22-20తో సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌ను దక్షిణ కొరియా ఆటగాడు 21-7తో అలవోకగా నెగ్గాడు. ఒత్తిడిలో మెప్పించిన సాయిప్రణీత్ చాన్నాండ్ల తర్వాత ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.
థారులాండ్ మాస్టర్స్‌లో బారత షట్లర్లకు నిరాశే మిగిలింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో ఇషాన్ భట్‌నగర్, తానిషా క్రస్టో జోడీ 19-21, 16-21తో ఇండోనేషియా ద్వయం చేతిలో పరాజయం పాలయ్యారు. మెన్స్ డబుల్స్‌లో ఇషాన్, సాయి ప్రతీక్ జోడీ 14-21, 21-18, 24-26తో థారులాండ్ జంటతో పోరాడి ఓడారు. మూడు గేముల హోరాహోరీ మ్యాచ్‌లో భారత యువ జంటకు నిరాశే ఎదురైంది. మెన్స్ సింగిల్స్‌లో కిరణ్ జార్జ్ 22-20, 15-21, 20-22తో హాంగ్‌కాంగ్ షట్లర్ చేతిలో పరాజయం చెందాడు.