Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాయంతో తొలి టెస్టుకు దూరం
బెంగళూర్ : ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజెల్‌వుడ్ గాయంతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. సఫారీతో సిడ్నీ టెస్టులో గాయపడిన హాజెల్‌వుడ్.. బెంగళూర్‌లో పెద్దగా సాధన చేయలేదు. మ్యాచ్‌కు రెండు రోజుల ముందు బౌలింగ్ సాధన చేస్తానని కోచ్‌తో చెప్పాడు. కానీ రనౌప్ సమయంలో ఎడమ కాలు తీవ్రంగా వేధిస్తుండటంతో హాజెల్‌వుడ్ ఫిజియోకు ఫిర్యాదు చేశాడు. నాగ్‌పూర్ టెస్టుతో పాటు రెండో టెస్టు (న్యూఢిల్లీ)కు సైతం హాజెల్‌వుడ్ అనుమానంగానే మారాడు. దీంతో స్కాట్ బొలాండ్ విదేశీ గడ్డపై తొలి టెస్టు ఆడనున్నాడు.