Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాగ్‌పూర్ టెస్టుపై కెఎల్ రాహుల్
నాగ్‌పూర్ : ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే ఆలోచన, ఆసక్తి ఉన్నాయని టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ అన్నాడు. ఫిబ్రవరి 9న తొలి టెస్టు ఆరంభానికి ముందు కెఎల్ రాహుల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. ' తొలి టెస్టుకు పిచ్ ఎలా ఉంటుందో ఇంకా తెలియదు. మ్యాచ్‌కు ముందు రోజు మాత్రమే ఓ అంచనాకు రాగలం. ప్రస్తుతానికి భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే ఆలోచన ఉంది. స్పిన్ ట్రాక్‌పైనా రివర్స్ స్వింగ్ ప్రభావంపై అప్రమత్తంగానే ఉన్నాం. నాణ్యమైన పేసర్లు రివర్స్ స్వింగ్ ఆయుధంతో దెబ్బకొట్టగలరు. ఆసీస్‌కు నాణ్యమైన పేసర్లున్నారు. అగ్రజట్లతో ఆడినప్పుడు ఎదురయ్యే సవాల్‌ను ఆస్వాదిస్తాం. ఇక తుది జట్టు కూర్పులో 15 మందిని తీసుకోలేం. మ్యాచ్ విన్నర్లనే జట్టులోకి ఎంపిక చేస్తారు. పరిస్థితులు, ప్రత్యర్థి, వేదిక ఆధారంగా తుది 11 మంది ఎంచుకోవాల్సి ఉంటుంది' అని కెఎల్ రాహుల్ అన్నాడు.