Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్విమ్మర్ వ్రితికి సైతం పసిడి
హైదరాబాద్ : ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ క్రీడాకారులు జోరు చూపిస్తున్నారు. ఫెన్సింగ్‌లో వి. లోకేశ్, స్విమ్మింగ్‌లో వ్రితి అగర్వాల్ బంగారు పతకాలు సాధించారు. మెన్స్ ఫెన్సింగ్ ఎప్పీ ఈవెంట్లో లోకేశ్ ప్రత్యర్థులను చిత్తు చేశాడు. ఫైనల్లో పశ్చిమ బెంగాల్ ఫెన్సర్ లైశ్రామ్ (సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు, ఆర్మీ)పై 14-15తో సాధికారిక విజయం నమోదు చేశాడు. లైశ్రామ్, నీర్ (హర్యానా), కానెసింగ్ (మణిపూర్) వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు. మహిళల 800 మీటర్ల ప్రీ స్టయిల్ స్విమ్మింగ్‌లో వ్రితి అగర్వాల్ మెరిసింది. 9.35.61 సెకండ్ల టైమింగ్‌తో పసిడి పతకం సొంతం చేసుకుంది. మహిళల రోయింగ్ స్కల్ ఈవెంట్లో హేమలత ఫైనల్లోకి ప్రవేశించి పతకం ఖాయం చేసుకుంది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ ఐదు స్వర్ణాలు, మూడు రతజాలు, ఆరు కాంస్య పతకాలతో 11వ స్థానంలో కొన సాగుతుంది.బంగారు పతకం సాధించిన వి. లోకేశ్‌ను తెలంగాణ ఫెన్సింగ్ సంఘం అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, కోశాధికారి సందీప్ కుమార్ అభినందించారు.