Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిబ్రవరి 13న డబ్ల్యూపీఎల్ ప్లేయర్స్ వేలం
ముంబయి : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఆరంభ సీజన్ ప్లేయర్ల వేలంలో 409 మంది క్రికెటర్లు రానున్నారు. ఫిబ్రవరి 13న ముంబయిలోని జియో సెంటర్లో క్రికెటర్ల వేలం నిర్వహించనున్నారు. 15 దేశాల నుంచి 409 మంది మహిళా క్రికెటర్లు వేలంలో నిలువనున్నారు. వేలంలో నిలిచేందుకు 1525 మంది క్రికెటర్లు దరఖాస్తు చేసుకోగా బీసీసీఐ 246 భారత, 163 విదేశీ క్రికెటర్లను తుది జాబితాకు ఎంపిక చేసింది. ఐదు ప్రాంఛైజీలు వేలంలో గరిష్టంగా 90 మంది క్రికెటర్లను ఎంచుకునే అవకాశం ఉంది. వేలంలో ఏడుగురు విదేశీ క్రికెటర్ల ఎంచుకునే వెసులుబాటు ఇవ్వగా, అందులో ఒకరు అసోసియేట్ జట్టు వారై ఉండాలి. ప్రతి ప్రాంఛైజీ రూ.12 కోట్లు కలిగి ఉంటుంది. రూ.50 లక్షల కనీస ధర జాబితాలో 14 విదేశీ, 10 భారత సహా 24 క్రికెటర్లు చోటుచేసుకున్నారు. హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతీ మంధాన, దీప్తి శర్మ, రేణుక సింగ్, జెమీమా రొడ్రిగస్, షెఫాలీ వర్మ, పూజ వస్ట్రాకర్, రిచా ఘోష్, స్నేV్‌ా రానా, మేఘన సింగ్‌లు రూ.50 లక్షల కనీస ధర జాబితాలో ఉన్నారు. గార్డ్నర్, ఎలీసీ పెర్రీ, మెగ్ లానింగ్, అలీసా హీలే, జెస్ జొనాసెస్, డార్సీ బ్రౌన్, సోఫీ, సీవర్, డానీ వ్యాట్, సీవర్ బ్రంట్, సోఫీ డెవిన్, సినాలో, డాటిన్, ఫిరిలు సైతం రూ.50 లక్షల కనీస ధర జాబితాలో నిలిచారు. మహిళా క్రికెటర్ల వేలం ప్రక్రియం ఫిబ్రవరి 13న మధ్యాహ్నాం 2.30 గంటలకు ఆరంభం కానుంది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, అదానీ గ్రూప్, కాప్రి గ్లోబల్‌లు జట్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఐదు ప్రాంఛైజీల వేలంతో బీసీసీఐ రూ.4669.99 కోట్లు ఆర్జించింది. ఆరంభ మహిళల ప్రీమియర్ లీగ్ మార్చి 4-26 వరకు జరుగనుంది. లీగ్‌లో మొత్తం 22 మ్యాచులను ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియం, డివై పాటిల్ స్టేడియంలో నిర్వహించనున్నారు.
మనోళ్లు ఐదుగురు :
మహిళల ప్రీమియర్ లీగ్ ప్లేయర్స్ వేలంలో తెలంగాణ క్రికెటర్లు ఐదుగురు చోటు దక్కించుకున్నారు. ఐసీసీ అండర్-19 టీ20 ప్రపంచకప్ స్టార్స్ గొంగడి త్రిష, యశశ్రీ సహా మమత, ప్రణవి, కోడూరి ఇషితలు వేలంలో నిలిచారు. ఐదుగురు క్రికెటర్లూ రూ.10 లక్షల కనీస ధర జాబితాలో ఉన్నారు.