Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2021- 23 సీజన్ ఫైనల్ తేదీని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఖరారు చేసింది. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఓవల్ వేదికగా జూన్ 7-11 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. జూన్ 12ను రిజర్వుడేగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. రెండు సంవత్సరాల్లో ఆడే టెస్ట్ సిరీస్ ఫలితాల ఆధారంగా రెండు జట్లు ఫైనల్‌కు చేరుతాయి. కాగా, ఈ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆస్ట్రేలియా (75.56) అగ్రస్థానంలో ఉంది. ఇండియా (58.93) రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టు సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు గెలిస్తే టీమిండియా ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. ఈ రెండు జట్లతో పాటు మరో నాలుగు జట్లు ఫైనల్ బెర్తుపై కన్నేశాయి. మూడో ప్లేస్‌లో ఉన్న శ్రీలంక (53.33), నాలుగో స్థానంలోని సౌతాఫ్రికా(48.72), ఐదు, ఆరు ర్యాంకింగ్స్‌లో నిలిచిన న్యూజిలాండ్, వెస్టిండీస్‌కు ఫైనల్ చేరే అవకాశం ఉంది. ఇందులో న్యూజిలాండ్ గడ్డపై శ్రీలంక రెండు టెస్టులు ఆడాల్సి ఉండగా.. సౌతాఫ్రికాలో వెస్టిండీస్ రెండు మ్యాచ్‌లు ఆడాలి.