Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్సాహంగా తొలి రోజు కుస్తీ పోటీలు
హైదరాబాద్ : ముఖేశ్ గౌడ్ మెమోరియల్ 'మల్లయుద్ధ' రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలు గురువారం ఎల్బీ స్టేడియంలో ఘనంగా ఆరంభమయ్యాయి. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన రెజ్లింగ్ క్రీడాకారులను గుర్తించి, జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలకు సన్నద్ధమయ్యేందుకు అవసరమైన ఉపకార వేతనాలు అందించే బహత్తర లక్ష్యంతో శ్రేష్ఠ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న కుస్తీ పోటీలను మాజీ మంత్రి, బిజెపీ జాతీయ ఉపాధ్యక్షులు డికె అరుణ ప్రారంభించారు. ' ముఖేశ్ గౌడ్ రెజ్లర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టారు. ఆయన స్మారకార్థం రూ.35 లక్షల నగదు బహుమతితో కుస్తీ పోటీలను ఈ స్థాయిలో నిర్వహించటం అభినందనీయం. శ్రేష్ఠ్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్ర రెజ్లర్లు ఉన్నత స్థాయికి చేరుకోవాలని' డికె అరుణ ఆకాంక్షించారు. శ్రేష్ఠ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు విక్రమ్ గౌడ్‌తో కలిసి డికె అరుణ పోటీలను ప్రారంభించారు. తొలి రోజు పురుషుల అండర్-15, అండర్-17 విభాగాల్లో కుస్తీ పోటీలు జరిగాయి. 17 విభాగాల్లో 700 మంది రెజ్లర్లు పోటీపడుతున్న రాష్ట్ర స్థాయి చాంపియన్‌షిప్ పోటీలు ఫిబ్రవరి 12న ముగియనున్నాయి.