Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ముఖేశ్ గౌడ్ స్మారక 'మల్లయుద్ధ' రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలు ఉత్కంఠగా సాగుతున్నాయి. ఎల్బీ స్టేడి యంలో మూడు రోజుల పాటు సాగుతున్న మల్లయుద్ధ పోటీల్లో నేడు అన్ని విభాగాల్లో ఫైనల్స్ జరుగనున్నాయి. పురుషుల 55 కేజీలు, 60 కేజీలు, 66 కేజీలు, 74 కేజీలు, 87 కేజీలు సహా 100 కేజీలు, 120 కేజీల విభాగాల్లో పోటీలు శనివారం ఆకట్టుకున్నాయి. రాజ్యసభ సభ్యుడు డా.కె లక్ష్మణ్ శనివారం కుస్తీ పోటీల సెమీఫైనల్స్‌ను ప్రారంభించారు. 'తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించేలా ప్రోత్సహించాలి. అప్పుడే క్రీడా భారత్ సాధ్యపడుతుంది. ముఖేశ్ గౌడ్ స్మారకార్థం రూ.35 లక్షల నగదు బహుమతితో రెజ్లింగ్ పోటీలు నిర్వహించటం సంతోషం. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న శ్రేష్ఠ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు విక్రమ్ గౌడ్‌కు అభినందనలు' అని లక్ష్మణ్ తెలిపారు. 17 విభాగాల్లో 700 మంది రెజ్లర్లు పోటీపడుతున్న మల్లయుద్ధ చాంపియన్‌షిప్స్‌లో మహిళలకు సైతం ప్రత్యేకంగా పోటీలు నిర్వహిస్తున్నారు.