Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్లో క్యాపిటల్స్‌పై గెలుపు
జొహనెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాతో హైదరాబాద్ అనుబంధం కొనసాగుతుంది!. 2009లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఐపీఎల్లో చాంపియన్‌గా డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ నిలువగా.. తాజాగా దక్షిణాఫ్రికాలో మొదలైన నూతన టీ20 లీగ్ ఎస్ఏ20 తొలి చాంపియన్‌గా సన్‌రైజర్స్ అవతరించింది. వర్షం కారణంగా రిజర్వ్ డేలో జరిగిన ఫైనల్లో ప్రిటోరియ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో 135 పరుగులకు కుప్పకూలింది. స్వల్ప లక్ష్యాన్ని 16.2 ఓవర్లలోనే ఊదేసిన హైదరాబాద్.. లీగ్ టైటిల్ అందుకుంది. ఓపెనర్ రొసింగ్టన్ (57), కెప్టెన్ మార్కరం (26) ఛేదనలో రాణించారు. సన్‌రైజర్స్ సారథి ఎడెన్ మార్కరం 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'గా నిలువగా, ఆరెంజ్ ఆర్మీ బౌలర్ వాండర్ మెర్వె 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.