Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిట్నెస్ సాధించిన బ్యాటర్
ముంబయి : పిట్నెస్ సమస్యలతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టుకు దూరమైన టీమ్ ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రెండో టెస్టుకు అందుబాటులో ఉండ నున్నాడు. బెంగళూర్ లోని జాతీయ క్రికెట్ అకాడమీలో నిపుణుల పర్యవేక్షణలో ఫిట్‌నెస్‌పై దృష్టి నిలిపిన అయ్యర్.. ఫిబ్రవరి 17 నుంచి న్యూఢిల్లీలో ఆరంభం కానున్న రెండో టెస్టుకు తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ టెస్టులో సూర్యకుమార్ యాదవ్ అరంగేట్రం చేశాడు. అయ్యర్ పునరాగమనంతో ఢిల్లీ టెస్టులో సూర్యకుమార్ బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. భారత్‌కు ఏడు టెస్టులు ఆడిన అయ్యర్ 56.72 సగటుతో 624 పరుగులు చేశాడు. స్పిన్‌పై ఎదురుదాడి చేయటం అయ్యర్ ప్రధాన బలం. ఆసీస్‌తో సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ కీలకం కానున్నాడు.