Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రికెటర్లు త్రిష, యశశ్రీ సహా ఖేలో ఇండియా విజేతలకు సన్మానం
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి మహిళా చెస్ చాంపియన్‌షిప్ పోటీలు శుక్రవారం ఎల్బీ స్టేడియంలో ఘనంగా ముగిశాయి. రెండు రోజుల మెగా చెస్ చాంపియన్‌షిప్స్‌లో తొలి రోజు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించగా.. రెండో రోజు రాష్ట్ర స్థాయిలో పోటీలు జరిగాయి. రాష్ట్ర స్థాయి ఫైనల్స్‌లో గాదె శరణ్య (రంగారెడ్డి జిల్లా) ఓవరాల్ విజేతగా నిలిచింది. ఇతర విభాగాల్లో దీక్షిత, క్రితిక, అభిరామి, రేణుక, జ్ఞానత, విజేత, షరిష్మా ప్రతిభ కనబరిచి నగదు ప్రోత్సాహకాలు అందుకున్నారు. మండలి డిప్యూటీ చైర్మెన్ బండ ప్రకాశ్, క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, శాట్స్ చైర్మెన్ ఆంజనేయ గౌడ్లు చెస్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఖేలో ఇండియాలో పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారులు, ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ విజేతలు త్రిష, యశశ్రీలను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు.