Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాట్స్ చైర్మెన్, ఎండీని సంప్రదించని వైనం
- ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకపక్ష నిర్ణయాలు
నవతెలంగాణ-హైదరాబాద్
చారిత్రక ఫతే మైదాన్ క్లబ్ (ఎఫ్ఎంసీ)లో ప్రస్తుతం కొత్త మెంబర్షిప్ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఫిబ్రవరి 4న సమావేశమైన ఎఫ్ఎంసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నూతనంగా120 మందికి సభ్యత్వాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రస్తుతం ఉన్న సభ్యులు రూ.4 లక్షల సభ్యత్వ రుసుముతో మెంబర్షిప్ పొందగా.. కొత్తగా ఇవ్వనున్న 120 సభ్యత్యాలకు రూ.2 లక్షలు ఫీజుగా నిర్ణయించారు. నూతన సభ్యత్యాల రుసుముపై జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని ఎగ్జిక్యూటివ్ కమిటీలో సూచనలు చేసినా.. బేఖాతరు చేస్తూ ఏకపక్షంగా ముందుకెళ్తున్నారు. నూతన సభ్యత్వాలకు రూ.2 లక్షల ఫీజునే ఎలా వసూలు చేస్తారని ప్రస్తుత సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఓటింగ్ హక్కుతో కూడిన సభ్యత్యాన్ని చౌకగా సన్నిహితులకు కట్టబెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని సభ్యులు విమర్శిస్తున్నా రు. శాట్స్ చైర్మెన్‌కు ఫిర్యాదు : ఫతే మైదాన్ క్లబ్ ఏకపక్ష నిర్ణయాలపై కొందరు సభ్యులు శాట్స్ చైర్మెన్ ఆంజనేయ గౌడ్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఎఫ్ఎంసీ, శాట్స్ (శాప్) ఎంఓయూ ప్రకారం కీలక నిర్ణయాలను శాట్స్ చైర్మెన్, వీసీ-ఎండీ అనుమతితో తీసుకోవాల్సి ఉంది. ఈ మేరకు క్లబ్ 1969 నిబంధనల్లో స్పష్టంగా ఉంది. సభ్యత్య నమోదు, రుసుము అంశంలో ఎఫ్ఎంసీ నిర్ణయాలపై తక్షణే జోక్యోం చేసుకోవాలని శాట్స్ చైర్మెన్‌ను కొందరు సభ్యులు కోరినట్టు సమాచారం.