Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాయంతో స్వదేశానికి పయనం
- టెస్టు సిరీస్‌కు దూరమైన ఓపెనర్
న్యూఢిల్లీ : భారత పర్యటనలో ఆస్ట్రేలియా సమస్యలు రోజు రోజుకు రెట్టింపు అవుతున్నాయి. కెప్టెన్ పాట్ కమిన్స్ కుటుంబ కారణాలతో స్వదేశానికి వెళ్లిపోగా.. పేసర్ జోశ్ హాజెల్‌వుడ్ గాయంతో టెస్టు సిరీస్ నుంచి నిష్క్ర మించాడు. తాజాగా, డ్యాషింగ్ ఓపెనర్ డెవిడ్ వార్నర్ సైతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి దూరమ య్యాడు. భారత్‌తో రెండో టెస్టులో మహ్మద్ సిరాజ్ బౌన్సర్ డెవిడ్ వార్నర్‌కు బలంగా తగిలింది. కంకషన్తో పెవిలియన్‌కు చేరిన డెవిడ్ వార్నర్ స్థానంలో మాట్ రెన్షా ఆడాడు. ఇండోర్‌లో జరగాల్సిన మూడో టెస్టుకు మరో 8 రోజుల సమయం ఉండటంతో వార్నర్ కోలుకుంటాడనే విశ్వాసం ఆసీస్ శిబిరంలో కనిపించింది. డెవిడ్ వార్నర్ ఎడమ చేతి మోచేయికి ఎయిర్‌లైన్ ఫ్రాక్చర్ అయ్యిందని వైద్య నివేదికల్లో తేలింది. దీంతో డెవిడ్ వార్నర్ తదుపరి వైద్య చికిత్స కోసం ఆస్ట్రేలియా బయల్దేరాడు. డెవిడ్ వార్నర్ స్థానంలో ట్రావిశ్ హెడ్ మూడో టెస్టులో ఓపెనర్ అవతారం ఎత్తే అవకాశం కనిపిస్తోంది. కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్‌లు సైతం ఫిట్నెస్ సాధించాల్సి ఉంది. మూడో టెస్టుకు ఆస్ట్రేలియా తుది జట్టు నిలిపేందుకు సైతం ఆపసోపాలు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి!.