Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తైక్వాండో పోటీలు ప్రారంభించిన శాట్స్ చైర్మన్
హైదరాబాద్ : ఆరోగ్యకర జీవనశైలితో పాటు ఆత్మరక్షణకు సైతం ఊతం ఇచ్చే మార్షల్ ఆర్ట్స్‌కు తెలంగాణలో మంచి ఆదరణ ఉందని శాట్స్ చైర్మెన్ ఆంజనేయ గౌడ్ అన్నారు. మహిళలు, విద్యార్థుల్లో మనోధైర్యం పెంపొందించేందుకు మార్షల్ ఆర్ట్స్‌ను విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహించాలి. మార్షల్ ఆర్ట్స్‌ను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆంజనేయ గౌడ్ తెలిపారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం 5వ జాతీయ క్యాడెట్ తైక్వాండో చాంపియన్‌షిప్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన శాట్స్ చైర్మెన్.. జ్యోతి ప్రజ్వలనతో పాటు వివిధ విభాగాల్లో పోటీలను ఆరంభించారు. తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు వేణుగోపాల చారి, జాతీయ తైక్వాండో సమాఖ్య అధ్యక్షులు ఇషారి, గణేశ్, తెలంగాణ తైక్వాండో సంఘం అధ్యక్షుడు సతీశ్ గౌడ్ తదితరులు ఆరంభ వేడుకల్లో పాల్గొన్నారు.