Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబాయ్ : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ విలువైన జట్టులో భారత్ నుంచి వికెట్‌కీపర్ బ్యాటర్ రిచా ఘోస్‌కు మాత్రమే చోటు లభించింది. ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో సత్తా చాటిన రిచా ఘోష్.. ఉమెన్స్ టీ20 ప్రపంచకప్‌లోనూ రాణించింది. టోర్నీలో 130.76 స్ట్రయిక్‌రేట్‌తో 136 పరుగులు నమోదు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్.. పాకిస్థాన్‌పై 31 నాటౌట్, వెస్టిండీస్‌పై 44 నాటౌట్, ఇంగ్లాండ్‌పై 47 నాటౌట్ ఇన్నింగ్స్‌లు ఆడింది. టీ20 ప్రపంచకప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు రేసులో సైతం నిలిచిన రిచా ఘోష్..ప్రపంచకప్ విలువైన జట్టులో స్థానం దక్కించుకుంది. ఇంగ్లాండ్ కెప్టెన్ నటాలీ సీవర్ సారథిగా ఎంపికైంది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టు : టాజ్మిన్ బ్రిట్స్ (దక్షిణాఫ్రికా), అలీసా హేలే (ఆసీస్), లారా (దక్షిణాఫ్రికా), నటాలీ సీవర్ బ్రంట్ (ఇంగ్లాండ్, కెప్టెన్), ఆష్లె గార్డ్నర్ (ఆసీస్), రిచా ఘోష్ (భారత్), సోఫీ ఎకెల్‌స్టోన్ (ఇంగ్లాండ్), కరిష్మ (వెస్టిండీస్), షబ్మిం (దక్షిణాఫ్రికా), డార్సీ బ్రౌన్ (ఆసీస్), మేగన్ స్కాట్ (ఆసీస్), ఒర్లా (ఐర్లాండ్).