Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్, ఇంగ్లాండ్ రెండో టెస్టు రసవత్తర ముగింపునకు చేరుకుంది. బజ్‌బాల్ ధనాధన్‌తో న్యూజిలాండ్‌ను ఫాలోఆన్ ఆడించిన ఇంగ్లాండ్.. రెండో ఇన్నింగ్స్‌లో సవాల్‌తో కూడిన లక్ష్యాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగింది. 258 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్ 48/1తో కొనసాగుతోంది. బెన్ డకెట్ (23 నాటౌట్), ఒలీ రాబిన్సన్ (1 నాటౌట్) అజేయంగా ఆడుతున్నారు. జాక్ క్రావ్లీ (24) వికెట్ కోల్పోయాడు. నేడు చివరి రోజు ఆటలో ఇంగ్లాండ్‌కు 210 పరుగులు అవసరం కాగా, న్యూజిలాండ్ మరో 9 వికెట్ల పడగొట్టేందుకు చూస్తుంది. ధనాధన్ క్రికెట్‌తో టెస్టుల్లో కొత్త ఒరవడి సృష్టించిన ఇంగ్లాండ్.. నేడు కీలక సవాల్‌కు సిద్ధమవుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 435/8 పరుగులకు డిక్లరేషన్ ఇవ్వగా.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకు కుప్పకూలింది. ఫాలోఆన్‌లో న్యూజిలాండ్ గొప్పగా పుంజుకుంది. కేన్ విలియమ్సన్ (132), టామ్ లేథమ్ (83), టామ్ బ్లండెల్ (90), కాన్వే (61), డార్లీ మిచెల్ (54) రాణించటంతో 483 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.