Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆస్ట్రేలియా ఓపెనర్, స్టార్ క్రికెటర్ బెత్ మూనీ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అజేయ 74 పరుగుల ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియాకు రికార్డు ఆరో టైటిల్ అందించిన బెత్ మూనీ.. తొలిసారి ఓ విదేశీ టీ20 లీగ్‌లో కెప్టెన్సీ వహించనుంది. భారత ఆల్‌రౌండర్ స్నేV్‌ా రానా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రేచల్ హేన్స్ గుజరాత్ జెయింట్స్ హెడ్ కోచ్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. 'చారిత్రక మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్లో ఆదాని గ్రూపు గుజరాత్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం లభించటం గొప్పగా ఉంది. స్నేV్‌ా రానా, రేచల్, మిథాలీ రాజ్‌తో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను' అని బెత్ మూనీ తెలిపింది. మహిళల బిగ్‌బాష్ లీగ్, ది హండ్రెడ్‌లో బెత్ మూనీ మంచి రికార్డు నమోదు చేసింది. రూ.2 కోట్లకు బెత్ మూనీని గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకుంది.