Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్ల్యూటీసీ ఫైనల్స్ రిహార్సల్‌కు చాన్స్
ఇండోర్ : ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు రిహార్సల్ చేసేందుకు టీమ్ ఇండియా సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియా చివరి రెండు టెస్టుల్లో ఓ టెస్టులో విజయం సాధించినా.. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ చోటు ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ ఇండోర్ టెస్టులో భారత్ విజయం సాధిస్తే.. ఫలితం ప్రభావం చూపని అహ్మదాబాద్ టెస్టులో పచ్చిక పిచ్‌ను సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ సైతం అందుకు సానుకూల సంకేతాలు ఇచ్చాడు. గతంలో దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు స్వదేశంలో శ్రీలంకతో టెస్టులో ఈడెన్ గార్డెన్స్‌లో పచ్చిక పిచ్‌ను సిద్ధం చేయగా..పేసర్లు రెచ్చిపోయారు.
'అహ్మదాబాద్‌లో పచ్చిక పిచ్ అవకాశం ఉంది. దీని గురించి జట్టులో చర్చ జరిగింది. జట్టు పచ్చిక పిచ్‌పై ఫైనల్స్‌కు సిద్ధం కావాలని కోరుకుంటున్నాం. పచ్చిక పిచ్‌పై శార్దుల్ ఠాకూర్ కీలకం. అతడు ఇప్పుడు ఏ మేరకు సిద్ధంగా ఉన్నాడనేది తెలియదు. కానీ ఇండోర్‌లో అనుకున్న ఫలితం వస్తే.. కచ్చితంగా అహ్మదాబాద్‌లో అటువంటి ప్రయోగానికి వెనుకాడం. ప్రస్తుతానికి భారత జట్టు ఫోకస్ పూర్తి ఇండోర్ టెస్టుపైనే ఉంది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు ఇంకా చాలా సమయం ఉంది. దాని గురించి ఆలోచన ఇప్పుడే లేదు' అని రోహిత్ శర్మ అన్నాడు.