Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1 పరుగు తేడాతో ఇంగ్లాండ్‌పై పైచేయి
వెల్లింగ్టన్ : కివీలు ఖతర్నాక్ విజయం సాధించారు. 226 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో ఫాలోఆన్ ఆడిన న్యూజిలాండ్.. 258 పరుగులను కాపాడుకుంది. ఛేదనలో ఇంగ్లాండ్ 256 పరుగులే చేయటంతో న్యూజిలాండ్ 1 పరుగు తేడాతో మెరుపు విజయం నమోదు చేసింది. నీల్ వాగర్ (4/62) నాలుగు వికెట్ల ప్రదర్శనతో ఇంగ్లాండ్ ఆశలు ఆవిరి చేశాడు. క్రావ్లీ (24), డకెట్ (33), స్టోక్స్ (33), ఫోక్స్ (35)లు జో రూట్ (95, 113 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) సహకరించటంతో ఇంగ్లాండ్ గెలుపు దిశగా సాగింది. కానీ వాగర్ కీలక వికెట్లతో ఆతిథ్య జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. రెండో టెస్టులో విజయంతో టెస్టు సిరీస్ ట్రోఫీని 1-1తో ఇరు జట్లు పంచుకున్నాయి. ఇంగ్లాండ్ 435/8, 256 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ 209, 483 పరుగులు చేసింది.